విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్ అమలు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ఆందోళకు దిగారు. సబ్ స్టేషన్లలో ఖాళీలను వెంటనే పూర్తి చేయాలని కోరారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల ఆందోళన - సర్వీసు రూల్స్
హైదరాబాద్లోని టీఎస్ఎస్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట విద్యుత్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు.
టీఎస్ఎస్పీడీసీఎల్ ఎదుట విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
కాంట్రాక్ట్ కార్మికులకూ ఏపీఎస్‌ఈబీ సర్వీసు రూల్స్ వర్తింపజేయాలని సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీధర్.. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 22న మొదలైన నిరసనలు.. ఈ నెల 18న ఛలో విద్యుత్ సౌధతో పూర్తవనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:వైఎస్ తలపెట్టిన ప్రాజెక్టులను ప్రభుత్వం పట్టించుకోలేదు: షర్మిల