కొత్తపేట ప్రధాన రహదారిపై వరద బాధితులతో కలిసి భాజపా, కాంగ్రెస్ నేతలు భైఠాయించి.. తక్షణమే బాధితులకు సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో భారీగా రాకపోకలకు అంతరాయం ఏర్పడడం వల్ల సరూర్‌నగర్ పోలీసులు రంగంలోకి దిగి... అందోళనకారులను అక్కడి నుంచి ఠాణాకు తరలించారు. సరూర్‌నగర్, గడ్డి అన్నారం కార్పోరేటర్లు అనితా దయాకర్ రెడ్డి, భవానీ ప్రవీణ్ నివాసాల ముందు మహిళలు ఆందోళనకు దిగారు. భాజపా, కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
సాయం కోసం భాజపా, కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా - flood victims protest infront of corporaters houses
వరద బాధితులకు తక్షణమే సాయం అందజేయాలని డిమాండ్ చేస్తూ... భాజపా, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్పొరేటర్ల ఇళ్ల ముందు మహిళలు ఆందోళనకు దిగారు. కొత్తపేట ప్రధాన రహదారిపై భైఠాయించడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అక్కడికి చేరుకున్న పోలీసులు అందోళనకారులను పోలీస్ స్టేషన్కు తరలించారు.
Breaking News
జోనల్ కార్యాలయాలనూ ముట్టడించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.10 వేల ఆర్థిక సాయం పక్కదారి పడుతుందని.. నిజమైన లబ్ధిదారులకు అందలేదని వాపోయారు. మలక్‌పేట పరిధిలోని ముసారాంబాగ్‌లోని లోతట్టు ప్రాంతాల గుడిసెవాసులు అర్థిక సహాయం అందలేదని ముసారాంబాగ్ - అంబర్ పేట వంతెనపై భైఠాయించి అందోళన చేపట్టారు.