తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది' - అమరావతి రైతుల ఆందోళన వార్తలు

అమరావతి ఉద్యమానికి ఖండాతరాల్లోని తెలుగువారు మద్దతు తెలుపుతున్నారు. రాజధాని రైతుల పోరాటం 200వ రోజుకు చేరిన సందర్భంగా.. పలు దేశాల్లోని తెలుగువారు నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. అన్నదాతలకు అండగా ఉంటామంటూ అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలోని ఎన్​ఆర్​ సంఘం సంఘీభావం తెలిపింది.

'ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది'
'ప్రభుత్వ ప్రకటన వచ్చే వరకు అమరావతి ఉద్యమం కొనసాగుతుంది'

By

Published : Jul 6, 2020, 11:10 PM IST

అమెరికాలోని మిన్నియాపోలిస్ నగరంలోని ప్రవాసాంధ్రుల సంఘం... అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపింది. జై అమరావతి.. ఆంధ్రులంతా ఒక్కటే... ఆంధ్రుల రాజధాని ఒక్కటే, అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఈ ప్రతిపాదన వల్ల ప్రభుత్వానికి ఖర్చు తప్ప ప్రజలకు ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు. ఒక్క రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడ్డారు.

200 రోజులకుపైగా అమరావతి ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. అమరావతే రాజధానిగా ఉంటుందంటూ ఏపీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు రాజధాని రైతుల ఉద్యమంలో భాగస్వాములుగా ఉంటామని పేర్కొన్నారు.

ఇవీ చూడండి : పేదల విద్యుత్​ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details