తెలంగాణ

telangana

దేవాదాయ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత

దేవాదాయ భూములు పరిరక్షించాలంటూ భాజపా నాయకులు ధర్నాకు దిగారు. బొగ్గులకుంటలోని దేవాదాయ కమిషనర్ కార్యాలయంలోనికి దూసుకెళ్లడానికి యత్నించగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఓల్డ్​సిటీలోని కాళీమాత ఎండోమెంట్ భూమిని కాపాడాలని నాయకులు డిమాండ్ చేశారు.

By

Published : Dec 19, 2020, 1:07 PM IST

Published : Dec 19, 2020, 1:07 PM IST

Updated : Dec 19, 2020, 1:25 PM IST

protest at Office of the Commissioner of Revenue in hyderabad
దేవాదాయ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత

దేవాలయ భూములను పరిరక్షించాలంటూ.. భాజపా నాయకులు చేపట్టిన దేవాదాయ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. హైదరాబాద్ బొగ్గులకుంటలోని కార్యాలయ పరిసరాల్లో 500 మందితో మూడంచెల పటిష్ఠ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కార్యాలయంలోనికి దూసుకెళ్లడానికి యత్నించిన భాజపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారిని బలవంతంగా అరెస్ట్ చేశారు.

దేవాదాయ కార్యాలయ ముట్టడిలో ఉద్రిక్తత

ఈ నేపథ్యంలో పోలీసులకు, భాజపా నాయకుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఓల్డ్​సిటీలోని కాళీమాత ఎండోమెంట్ భూమిని కాపాడాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. దేవాదాయశాఖకు సంబంధించిన కోట్ల విలువ చేసే భూములు కబ్జా అవుతున్నా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్న దేవాదాయశాఖ భూములకు రక్షణ కల్పించాలని.. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

ఇదీ చూడండి: కదనరంగాన్ని తలపించిన యుద్ధవిమాన విన్యాసాలు

Last Updated : Dec 19, 2020, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details