తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2021, 6:43 PM IST

ETV Bharat / city

'ఏడాదైనా ఎందుకు నియమాక పత్రాలు ఇవ్వలేదు?'

లక్డీకపూల్‌లోని ఉన్నత విద్యా కమిషనర్‌ కార్యాలయం ముందు సమగ్ర శిక్షా అభియాన్‌ పరీక్షలో మెరిట్​ సాధించిన అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి, మెరిట్‌ అభ్యర్థులను ప్రకటించి ఏడాది గడిచినా.. ఇప్పటి వరకు నియమాక పత్రాలు ఇవ్వలేదని నిరసనకు దిగారు.

protest at  lakdikapul by merit candidates in ssa exam
'ఏడాదైనా ఎందుకు నియమాక పత్రాలు ఇవ్వలేదు?'

సమగ్ర శిక్షా అభియాన్​లో ఉద్యోగుల భర్తీని వెంటనే చేపట్టాలని లక్డీకపూల్‌లోని ఉన్నత విద్యా కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పరీక్షలు నిర్వహించి, మెరిట్‌ అభ్యర్థులను ప్రకటించి ఏడాది గడిచినా.. ఇప్పటి వరకు నియమాక పత్రాలు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, విద్యాశాఖ కమిషన్‌ వెంటనే స్పందించి నియమాక పత్రాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతోందని హర్షవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. సమగ్ర శిక్షా అభియాన్‌లో నిధులను 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం సమకూర్చాల్సి ఉన్నా.. ప్రభుత్వం నిధులు కేటాయించలేకపోతోందని విమర్శించారు.

ఇదీ చూడండి: 'సభ్య సమాజానికి కేసీఆర్​ ఏం మెసేజ్​ ఇస్తున్నట్టు?'

ABOUT THE AUTHOR

...view details