కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో ఆయన ప్రసంగించారు.
'కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు' - తెలంగాణ ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తాజా
భారత్ బంద్‌లో భాగంగా తెలంగాణ ఎన్జీవో వ్యవసాయ అధికారుల సంఘం హైదరాబాద్‌లో ధర్నా నిర్వహించింది. బషీర్‌బాగ్‌లోని వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నాలో తెలంగాణ ఎన్జీవో సంఘ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ పాల్గొన్నారు.
'కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు'
ప్రభుత్వ రంగ సంస్థలను ఒకొక్కటిగా ప్రైవేటు పరం చేస్తూ.. కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పెండింగులో ఉన్న ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్చలకు పిలవాలని కోరారు.
ఇదీ చూడండి: టై గ్లోబల్ ఛైర్మన్ మహవీర్ శర్మకు ప్రధాని మోదీ సందేశం