సమాజంలో స్తీృ స్వేచ్ఛ ఎలా ఉందో.. హేమంత్ హత్యా ఉదంతం తెలియ చేస్తోందని ఐద్వా నగర కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో జరిగిన కుల దురహంకార హత్య కు నిరసనగా ఐద్వా గ్రేటర్ హైద్రాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ క్రాస్ రోడ్డులో మహిళలు నిరసన చేపట్టారు. హేమంత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించడం లేదు: ఐద్వా - సంగారెడ్డి కుల హత్య తాజా
అవంతికకు ప్రభుత్వం న్యాయం చేయాలని, హేమంత్‌ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐద్వా మహిళా సంఘం డిమాండ్ చేసింది. సంగారెడ్డిలో జరిగిన కుల హత్యకు నిరసనగా ఐద్వా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన చేపట్టారు.
ప్రభుత్వం నిందితులను కఠినంగా శిక్షించడం లేదు: ఐద్వా
రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో, గ్రామాల్లో ఇలాంటి దాడులు విపరీతంగా జరుగుతున్నా.. నిందితులను ప్రభుత్వం కఠినంగా శిక్షించడం లేదని ఆమె ఆరోపించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా రాష్ట్రంలో కుల వివక్ష కొంచమైనా తగ్గకపోగా.. హత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, పాఠశాల స్థాయి నుంచి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వానికి విన్నవించారు.