తెలంగాణ

telangana

ETV Bharat / city

కేపీహెచ్​బీలో స్పా ముసుగులో వ్యభిచారం - prostitution at glow well spa in kukatpally

హైదరాబాద్​ కూకట్​పల్లిలో​ బ్యూటీ సెలూన్, స్పాపై కేపీహెచ్​బీ పోలీసులు దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వారితోపాటు ఆరుగురు విటులను ఆరెస్టు చేశారు.

prostitution in the name of spa and beauty saloon at kukatpally in hyderabad
కేపీహెచ్​బీలో స్పా ముసుగులో వ్యభిచారం

By

Published : Feb 2, 2020, 3:24 PM IST

కేపీహెచ్​బీలో స్పా ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్​ కేపీహెచ్​బీలోని 6వ ఫేజులో వెంపటి సతీశ్​ అనే వ్యక్తి గ్లోవెల్​ ఫ్యామిలీ స్పా అండ్​ సెలూన్​ ఏర్పాటు చేశాడు. అందులో రిసెప్షనిస్ట్​గా నాగలక్ష్మీ అనే మహిళ పని చేస్తోంది. వీరిద్దరూ కలిసి... స్పాకు వచ్చే కస్టమర్లతో వ్యభిచారం చేయిస్తున్నారు.

పోలీసులు స్పాపై దాడి చేశారు. నిర్వాహకులతోపాటు ఆరుగురు విటులను అరెస్టు చేసినట్లు ఇన్​స్పెక్టర్​ లక్ష్మీనారాయణ తెలిపారు. స్పాలో పని చేస్తున్న ముగ్గురు బాధిత యువతులను రక్షించి పునరావాస కేంద్రానికి తరలించామని వెల్లడించారు.

స్పాలో లక్షా 13వేల 450ల నగదు, 9 సెల్​ఫోన్లు, ఒక ల్యాప్​టాప్​, స్వైపింగ్​ మిషన్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details