తెలంగాణ

telangana

ETV Bharat / city

రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదన

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో కోదండ రామాలయ పునర్నిర్మాణానికి బోడికొండను దేవాదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు బుధవారం పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.

proposal-for-reconstruction-of-ramateerdham-temple
రామతీర్థం ఆలయ పునర్నిర్మాణానికి ప్రతిపాదన

By

Published : Jan 7, 2021, 8:17 PM IST

ఏపీలోని విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రాన్నిదేవాదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు పరిశీలించారు. కోదండరాముని ఆలయం, నీటి మడుగును పరిశీలించిన అనంతరం రామతీర్థం దేవస్థానం అధికారులతో ఇంజినీరింగ్ అధికారులు చర్చించారు.

అనంతరం ఆ శాఖ ఎస్​ఈ శ్రీనివాసరావు విలేఖరులతో మాట్లాడుతూ.. కోదండరాముని విగ్రహం ధ్వంసం కావడంతో నూతన ఆలయ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. నిర్మాణ సామగ్రి ఎంత అవసరమో.. అన్నదాంతోపాటు ఇతర అంచనాలు వేశామన్నారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:ముచ్చటగా మూడోసారి డ్రైరన్​... క్షేత్రస్థాయి సమస్యలకు చెక్​

ABOUT THE AUTHOR

...view details