తెలంగాణ

telangana

ETV Bharat / city

'అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లపై నిషేధం' - రిజిస్ట్రేషన్లపై నిషేధం

prohibition on registrations of unauthorized places and buildings in state
'అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లపై నిషేధం'

By

Published : Aug 26, 2020, 5:39 PM IST

Updated : Aug 26, 2020, 7:17 PM IST

17:38 August 26

'అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లపై నిషేధం'

       అనుమతులు లేని స్థలాలు, భవనాల రిజిస్ట్రేషన్లను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ చేసింది. కొత్త పంచాయతీరాజ్, పురపాలకచట్టం నిబంధనలకు లోబడి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కమిషనర్ చిరంజీవులు ఆదేశాలు ఇచ్చారు.

        అనుమతులు లేని స్థలాలు, భవనాలను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టం చేశారు. లే అవుట్ అనుమతి, ఎల్ఆర్​ఎస్ ఉన్న ప్లాట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు. అనుమతులు ఉన్న, క్రమబద్దీకరణ చేసుకున్న భవనాలు, నిర్మాణాలను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలని సూచించారు. గ్రామకంఠంలో ఇప్పటికే నిర్మాణమైన భవనాల రిజిస్ట్రేషన్​కు అనుమతి ఇచ్చారు. 

     ఆదేశాలను తక్షణమే అమలు చేయాలన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ... ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి:పోడు భూముల కోసం గిరిజనుల పోరు..

Last Updated : Aug 26, 2020, 7:17 PM IST

ABOUT THE AUTHOR

...view details