ఏపీలోని కర్నూల జిల్లా దేవరగట్టులో సోమవారం రాత్రికి కర్రల సమరం నిర్వహించేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. అయితే కొవిడ్ దృష్ట్యా కర్రల సమరాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించనున్నారు. బయటి వ్యక్తులు దేవరగట్టుకు వచ్చేందుకు అనుమతి నిరాకరించారు. కేవలం పూజా కార్యక్రమాలకు మాత్రమే అనుమతినిచ్చారు. చుట్టుపక్కల గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేధించారు.
దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు.. 144 సెక్షన్ విధింపు..! - కర్నూలు కలెక్టర్ వీరపాండియన్ వార్తలు
ఏపీలోని కర్నూలు జిల్లాలోని దేవరగట్టులో ఏటా దసరా పర్వదినోత్సవం రోజున బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవంలో వేలాది మంది కర్రల సమరంలో పాల్గొంటారు. కరోనా ప్రభావం దృష్ట్యా బన్నీ ఉత్సవాన్ని నిషేధిస్తూ కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలిచ్చారు.
ఆంధ్రాలోని దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు
అనాదిగా వస్తున్న ఈ ఆచార సంప్రదాయాలను రద్దు చేయడం వల్ల అరిష్టం దాపురిస్తుందని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ సంప్రదాయాలను కొనసాగించేందుకు గ్రామస్థులు సన్నద్ధమవుతున్నారు.
ఇవీచూడండి:దేశవ్యాప్తంగా దసరా సంబరం, రావణ దహనం