Kodandaram Fires on KCR : తెలంగాణను తానే తెచ్చుకున్నట్లు కేసీఆర్ చరిత్రను వక్రీకరిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ మండిపడ్డారు. తెలంగాణలో ఆర్థికరంగం రాజకీయంతో పెనవేసుకుందని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక భూదందాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వం తీసుకువచ్చిన కంపెనీల్లో తెలంగాణ బిడ్డలకు ఎంతమందికి ఉపాధి కల్పించారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోడందరాం డిమాండ్ చేశారు.
'ఆంధ్రా గుత్తేదారులకే ప్రగతి భవన్‌లోకి ఎంట్రీ' - కేసీఆర్‌పై కోదండారమ్ ఫైర్
Kodandaram Fires on KCR : ప్రజల భాగస్వామ్యంతో వచ్చిన తెలంగాణను.. తానే తెచ్చుకున్నట్లు కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టి.. సచివాలయం లేకుండా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. జూన్ 2న ఆత్మగౌరవ దీక్ష చేయడంతోపాటు ఉద్యమకారులను ఏకం చేస్తామని తెలిపారు.
"కేసీఆర్ ఆంధ్రా పాలకులతో కుమ్మక్కయ్యారు. కృష్ణా జలాల విషయంలోనూ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించలేదు. వారి నిర్ణయంతో మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కరవుతో తల్లడిల్లుతున్నారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఆటంకం తెలంగాణ సర్కారే కలిగిస్తుంటే బాధ కలుగుతోంది. దళారీతనానికి పాల్పడుతున్న పాలకులకు వ్యతిరేకంగా మేం పోరాడతాం." - కోదండరామ్, తెజస అధ్యక్షుడు
ప్రగతిభవన్ ప్రవేశం తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రా గుత్తేదారులకే సునాయాసంగా ఉందని అగ్రహం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో అధికారంలోకి రాగానే కేసీఆర్ ప్రజల ఆకాంక్షను పక్కన పెట్టారని విమర్శించారు. సచివాలయం లేకుండా రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. జూన్ 2న ఆత్మగౌరవ దీక్ష చేయడంతోపాటు ఉద్యమకారులను ఏకం చేస్తామని వెల్లడించారు.