తెలంగాణ

telangana

ETV Bharat / city

'యురేనియం తవ్వకాలతో రాష్ట్రం విషతుల్యమవుతుంది' - పాలమూరు యురేనియం తవ్వకాలు

మహబూబ్​నగర్​ జిల్లా నల్లమల యురేనియం తవ్వకాలతో తెలంగాణ మొత్తం విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు ప్రొ.హరగోపాల్​ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు భూమిలో ఉన్న యురేనియం మాత్రమే కనిపిస్తోందా, భూమిపై నివసిస్తున్న ప్రజలు కనిపించడం లేదా అని నిలదీశారు.

'యురేనియం తవ్వకాలతో రాష్ట్రం విషతుల్యమవుతుంది'

By

Published : Aug 17, 2019, 5:36 PM IST


యురేనియం తవ్వకాలు కేవలం నల్లమల గిరిజనుల సమస్య మాత్రమే కాదని, దీనివల్ల రాష్ట్రమే విషతుల్యమయ్యే ప్రమాదముందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు ప్రొ.హరగోపాల్​ ఆవేదన చెందారు. మహబూబ్​నగర్​ జిల్లా నల్లమలలో యురేనియం తవ్వకాల వలన నీరు, గాలి, పర్యావరణ, జీవవైవిధ్యం అంత విషతుల్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వమే ఉద్యమం చేయాలని కోరారు. అభివృద్ధి అంటే సహజవనరులను ధ్వంసం చేయడమా అని ప్రశ్నించారు.

'యురేనియం తవ్వకాలతో రాష్ట్రం విషతుల్యమవుతుంది'

ABOUT THE AUTHOR

...view details