తెలంగాణ

telangana

By

Published : Dec 5, 2020, 8:59 AM IST

ETV Bharat / city

'ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన గొంతును ప్రజలు కోరుకున్నారు'

రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు అర్థమౌతోంది రాజనీతి శాస్త్ర విశ్లేషకులు డా.జి.ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి కల్పించే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో.. యువత, నిరుద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ ఫలితాల సరళి తెలుస్తోందన్నారు.

professor dr.g.prabhakar reddy annolasis on public opinion about ghmc elections
'ప్రభుత్వాన్ని ప్రశ్నించే బలమైన గొంతును ప్రజలు కోరుకున్నారు'

జీహెచ్ఎంసీ.. ఫలితాలను విశ్లేషిస్తే.. ప్రజలు మార్పును కోరుకుంటున్నట్లు అర్థమౌతోంది. ఇప్పటివరకూ ఏకఛత్రాధిపత్యంగా సాగిన టీఆర్ఎస్ పాలనకు.. ప్రత్యామ్నాయంగా ప్రజలు మరో ప్రశ్నించే గొంతుకోసం చూస్తున్నట్లు అర్థమౌతోంది. దీంతోపాటే.. పాలకపార్టీ అభ్యర్థుల మీదున్న వ్యతిరేకత, ప్రజాసమస్యలను విస్మరించడం, ఇటీవల వచ్చిన వరద నష్టానికి అందించిన అర్థిక సాయంలో జరిగిన అవకతవకలు కూడా ఈ ఎన్నికలపైన తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఉపాధి కల్పించే అంశాలపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో.. యువత, నిరుద్యోగులు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నట్లు ఈ ఫలితాల సరళి తెలుస్తోంది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం తన లోపాలను పునఃసమీక్షించుకోకపోతే.. రానున్న కాలంలో మరిన్ని ఎదురుదెబ్బలు తగిలేలాగానే కనిపిస్తున్నాయి. - డా. జి ప్రభాకర్ రెడ్డి. రాజనీతి శాస్త్ర విశ్లేషకులు

ABOUT THE AUTHOR

...view details