తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి కేటీఆర్​తో తెలుగుపై పట్టున్న ప్రొఫెసర్​ డానియేల్‌ నెగర్స్‌ భేటీ.. - ఫ్రాన్స్​కు కేటీఆర్​ బృందం

నాలుగురోజుల పర్యటనలో భాగంగా కేటీఆర్​ బృందం ఫ్రాన్స్​కు వెళ్లింది. భారీగా పెట్టుబడుల సమీకరణ లక్ష్యంతో కేటీఆర్‌ ఫ్రాన్స్‌ పర్యటన (IT Minister KTR) చేస్తున్నారు. ఇందులో భాగంగా.. కేటీఆర్​ పలువురిని కలుసుకుంటుండగా.. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్న ప్రొఫెసర్​ డానియేల్‌ నెగర్స్‌ మంత్రిని కలిశారు.

professor Daniel Negars met minister ktr in paris
professor Daniel Negars met minister ktr in paris

By

Published : Oct 31, 2021, 7:42 PM IST

నాలుగు రోజుల ఫ్రాన్స్​ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను తెలుగు భాషపై పట్టు ఉన్న ప్రొఫెసర్​ డానియేల్‌ నెగర్స్‌ కలిశారు. పారిస్‌ వెళ్లిన సమయంలో కేటీఆర్‌ను కలుసుకున్న నెగర్స్​.. మూడు దశాబ్దాలకుపైగా తెలుగు భాషపై పరిశోధన చేస్తున్నట్లు వివరించారు. తెలుగులో అనర్గళంగా మాట్లాడగలిగిన ప్రొఫెసర్ డానియేల్ నెగర్స్ కలిసి తెలుగులో మాట్లాడడంతో... కేటీఆర్‌ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

ఫ్రెంచ్ యూనివర్సిటీ "నేషనల్ ఇన్సిట్యూట్‌ ఫర్ ఓరియెంటల్ లాంగ్వేజెస్ అండ్ సివిలైజేషన్స్" లో దక్షిణ ఆసియా, హిమాలయన్ స్టడీస్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నెగర్స్‌ పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా తాను తెలుగు భాషపై పరిశోధన చేస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్‌కు వివరించారు. వేల మైళ్ల దూరాన ఉండి కూడా.. తెలుగు భాషపై చూపిస్తున్న మమకారం నిజంగా స్ఫూర్తిదాయకమని నెగర్స్‌ను మంత్రి కేటీఆర్‌ కొనియాడారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details