తెలంగాణ

telangana

ETV Bharat / city

Tammareddy Bharadwaja: 'నంది అవార్డులు ఇవ్వట్లేదు.. మినీ థియేటర్లకు ప్రోత్సాహం లేదు' - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తాజా వార్తలు

Tammareddy Bharadwaja: గురువారం(ఫిబ్రవరి 10న) సినీ పెద్దలకు, ఏపీ ప్రభుత్వానికి చర్చలు జరగనున్న వేళ.. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ వివిధ అంశాలపై స్పందించారు. ప్రభుత్వంతో సినీ పెద్దలు సామరస్య పూర్వకంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ క్రమంలో సినీపెద్దలకు పలు సూచనలు చేశారు.

producer-tammareddy-bharatwaj-speaks-over-cinema-tickets-issue
producer-tammareddy-bharatwaj-speaks-over-cinema-tickets-issue

By

Published : Feb 9, 2022, 5:34 PM IST

Tammareddy Bharadwaja: ప్రభుత్వాలతో సినీ పెద్దలు సామరస్యపూర్వకంగా చర్చించి సమస్యలను పరిష్కరించాలని నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. గురువారం సినీ పెద్దలకు, ఏపీ ప్రభుత్వానికి చర్చలు జరగనున్న వేళ.. ఆయన వివిధ అంశాలపై స్పందించారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేశారని గుర్తుచేశారు. ఈ విషయంపై ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. సినీ ఇండస్ట్రీకి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదన్నారు. తెలంగాణకు సంబంధించి లొకేషన్‌ ఛార్జీలు తీసేయాలని.. ఆంధ్రాలో మాదిరిగానే చేయాలని కోరారు.

సానుకూలంగా చర్చించాలి..

"ఆంధ్రాలో ‘పుష్ప’, ‘అఖండ’ చిత్రాలు మంచి వసూళ్లు రాబట్టాయి. ప్రొడక్షన్‌ ఖర్చుని బట్టి ఆయా సినిమాల్ని ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శిస్తుంటారు. ఇలా చేయటం వల్ల వసూళ్లు పెరుగుతాయి. అందుకే ‘పుష్ప’కంటే ‘అఖండ’ పెద్ద హిట్‌ అయినా తక్కువ కలెక్ట్‌ చేసింది. చాలామంది ‘మా సినిమా రూ. 300 కోట్లు, రూ.400 కోట్లు కలెక్ట్‌ చేసింది’ అని చెప్తున్నారు. వచ్చిన లాభంలో ప్రభుత్వానికి సంబంధిత ట్యాక్స్‌ కడితే వాతావరణం ఆరోగ్యకరంగా ఉంటుంది. మనమంతా నర్మగర్భంగా కాకుండా ప్రభుత్వంతో సానుకూలంగా చర్చించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి. పెద్ద సినిమాలతోపాటు ఎప్పుడూ 5వ షోలో చిన్న సినిమాలని ప్రదర్శిస్తే వాటికి మనుగడ ఉంటుంది"

- తమ్మారెడ్డి భరద్వాజ, సినీ నిర్మాత

తమ్మారెడ్డి సూచనలు..

  • గతంలో.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేసి నంది అవార్డులు ఇస్తామని చెప్పాయి కానీ ఇప్పటి వరకూ ప్రకటించలేదు.
  • చిన్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి.
  • మినీ థియేటర్లను ప్రోత్సహించాలి. అప్పట్లో.. ఏపీలో నాలుగు థియేటర్లని ప్రారంభించారు కానీ అధిక సంఖ్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు. అవి ఉన్నట్లైతే ఇప్పుడు థియేటర్ల కొరత పోయేది. చిన్న, పెద్ద సినిమా అని తేడా లేకుండా రెవెన్యూ పెరిగే అవకాశం ఉండేది. తెలంగాణలోనూ చిన్న థియేటర్లను మొదలుపెట్టాలనుకున్నారు కానీ కార్యరూపం దాల్చలేదు.
  • సినీ కార్మికులకి పెద్దగా రెవెన్యూ లేదు. అయినా బిల్లింగ్‌ పేరు చెప్పి జీఎస్టీ కోతలు వేస్తున్నారు. దానికి బదులుగా ఇఎస్‌ఐ, పీఎఫ్‌ వచ్చేలా చేస్తే బాగుంటుంది.
  • థియేటర్ల విద్యుత్తు వినియోగాన్ని కమర్షియల్‌ కిందకు రాకుండా చూడాలి. లాక్‌డౌన్‌ సమయంలో థియేటర్లు మూతపడినా మినిమమ్‌ ఛార్జీలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కమర్షియల్‌ కేటగిరిలో వాటిని చెల్లించాలంటే చాలా కష్టం.

ఇదీ చదవండి:

KALANKARI: మహిళల బతుకుల్లో కళ తెచ్చిన కలంకారీ

ABOUT THE AUTHOR

...view details