Dilraju latest news: మెగా ప్రోడ్యూసర్ దిల్‌రాజు తండ్రి కాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ విషయంపై దిల్‌రాజు కుటుంబం అధికారికంగా స్పందించాల్సి ఉంది. దిల్‌రాజు 2020 మే నెలలో రెండో వివాహం చేసుకున్నారు.
తండ్రి కాబోతున్న ప్రముఖ నిర్మాత..! - producer Dilraju who is going to be a father
Dilraju latest news: ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తండ్రి కాబోతున్నారనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. 2020 మే నెలలో రెండో వివాహం చేసుకున్నారు దిల్‌రాజు.
![తండ్రి కాబోతున్న ప్రముఖ నిర్మాత..! Dilraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14801863-100-14801863-1647945183765.jpg)
నిజామాబాద్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో దిల్‌రాజు రెండో పెళ్లి జరిగింది. లాక్‌డౌన్ నిబంధనల కారణంగా పరిమిత సంఖ్యలో అతిథుల మధ్య ఈ వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయం ఉన్న మహిళ తేజస్వినిని (వైఘా రెడ్డి) దిల్‌రాజు వివాహం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన ఆమె హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. దిల్ రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో మృతి చెందారు. మొదటి భార్యకు ఒక కూతురు ఉన్నారు. ఆమెకు ఇప్పటికే పెళ్లయ్యింది. ఒక కొడుకు కూడా ఉన్నాడని సమాచారం.
ఇదీ చూడండి:పునీత్‌కు మరణానంతరం డాక్టరేట్.. అశ్విని కన్నీటి పర్యంతం
TAGGED:
Dilraju latest news