గన్నవరం ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసమీకరణలో భాగంగా చేసుకున్న ఒప్పందానికి అధికారులు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని... లేదంటే ప్రత్యామ్నాయంగా తాము ఇచ్చిన భూములకు భూసేకరణ చట్టం ప్రకారం 210 కోట్ల రూపాయలు ఇప్పించాలని కోరుతూ.. సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సినీ నిర్మాత అశ్వినీదత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు - Producer Ashiwinidut latest news
తాము ఇచ్చిన భూములకు భూసేకరణ చట్టం ప్రకారం 210 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతూ.. సినీ నిర్మాత అశ్వినీదత్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్పోర్ట్ విస్తరణకు భూసమీకరణలో భాగంగా చేసుకున్న ఒప్పందానికి అధికారులు కట్టుబడి ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
సినీ నిర్మాత అశ్వినీదత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు
పిటిషన్ ఈరోజు జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ ను విచారించాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. రిజిస్ట్రీకి సంబంధిత పత్రాలు అందజేయాలని వారిని ధర్మాసనం ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
ఇదీ చదవండి:ఒక్కసారి ఒప్పందం కుదిరితే కంపెనీలదే పెత్తనం