ప్రజల రవాణా సౌకర్యార్థం దుర్గం చెరువు పైన ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జ్... ఇప్పుడు జనాల ప్రాణాల మీదికి వస్తోంది. చీకటి పడితే చాలు విద్యుత్ కాంతులతో దగదగా మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జ్‌ను చూసేందుకు జనం విపరీతంగా వస్తున్నారు. వారంలో రెండు రోజులు మాత్రమే ప్రజలకు బ్రిడ్జ్‌పైకి అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నా ఎవరూ పటించుకోవడం లేదు.
కేబుల్ బ్రిడ్జ్‌పై జనాల ఫీట్లు... తలలు పట్టుకుంటున్న పోలీసులు - cable bridge latest news
నగరవాసులకు అందుబాటులోకి వచ్చి కేబుల్ బ్రిడ్జ్... పోలీసులకు తలనొప్పిగా మారింది. అటు పార్కింగ్ సమస్యతో... ఇటు జనాలు చేసే ఫీట్లు ఆపలేక ఇబ్బందులు పడుతున్నారు. సెల్ఫీలు, ఫొటోల మోజులో పడి జనాలు ప్రాణాలు సైతం రిస్కులో పెడుతున్నారు.
problems with people at cable bridge in hyderabad
ఓ పక్కన పార్కింగ్ సమస్యతో పోలీసులు సతమతమౌతుంటే... దూసుకు వచ్చే వాహనాలను సైతం లెక్కచేయకుండా నడి రోడ్డులో నిలబడుతూ సెల్ఫీలు దిగుతూ ప్రజలు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవటం వల్ల ఇప్పుడు ఇదో తలనొప్పి వ్యవహారంగా మారింది.