తెలంగాణ

telangana

ఆర్టీసీ భవితవ్యం: త్వరలో ప్రైవేటు నోటిఫికేషన్​

By

Published : Nov 24, 2019, 6:46 AM IST

జాతీయం చేసిన ఆర్టీసీ మార్గాల్లో ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించేందుకు వీలుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే వారం నోటిఫికేషన్ జారీ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీలో ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతి ఇచ్చేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఆ దిశగానే సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

ఆర్టీసీ భవితవ్యం: త్వరలో ప్రైవేటు నోటిఫికేషన్​

ఆర్టీసీ భవితవ్యం: త్వరలో ప్రైవేటు నోటిఫికేషన్​

ఆర్టీసీ మార్గాల్లో ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించేందుకు వీలుగా నోటిఫికేషన్​ జారీకి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే రాష్ట్ర మంత్రిమండలి 5,100 బస్సులను ప్రైవేటుపరం చేసేందుకు తీర్మానం చేసింది. ఈ అంశంపై హైకోర్టు కూడా అభ్యంతరాలు చెప్పకపోవడం వల్ల.. విధివిధానాల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు.

ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఇటీవలే రవాణా చట్టంలో కేంద్రం సవరణలు చేపట్టింది. ఆ వెసులుబాటును రాష్ట్రాలకూ కల్పించింది. అయితే తొలుత జాతీయ జాబితా నుంచి ఆర్టీసీ మార్గాలను తొలగించి.. అనంతరం వాటిని ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయించాల్సి ఉంటుంది. అధికారికంగా ఆర్టీసీ విభజన జరగకపోవడం వల్ల ప్రవేటీకరణకు వీలుగా నోటిఫికేషన్​ ఇస్తే న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటాయా అనే కోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు.

ఆర్టీసీకి నోటీసు..

ఆర్టీసీ నియంత్రణలో ఉన్న మార్గాలను సరళీకరణ చేస్తున్నట్లు సంస్థకు ముందుగానే ప్రభుత్వం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని కొందరు విశ్రాంత ఉద్యోగులు పేర్కొన్నారు. ఆ తర్వాత మాత్రమే ప్రైవేటీకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందన్నారు. మార్గాల వారీగా ప్రభుత్వం నోటిఫికేషన్​ ఇస్తుందా..? లేక మొత్తం మార్గాల్లో ప్రైవేటు ఆపరేటర్లను అనుమతించనున్నట్లు పేర్కొంటుందా..? అన్నది ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే ఆ మార్గాల కోసం ప్రైవేటు ఆపరేటర్లతో పాటు ఆర్టీసీ కూడా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని చట్టం చెబుతోందని విశ్రాంత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

45 రోజులు సమయం..

ఆర్టీసీ మార్గాల్లో ప్రైవేటు ఆపరేటర్ల అనుమతి ప్రక్రియ పూర్తి అయ్యేందుకు కనీసం 45 రోజులు పడుతుందని ఆర్టీసీ, రవాణాశాఖ అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ జారీ తర్వాత అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అభ్యంతరాలు, సూచనలు, సలహాలను పరిష్కరించేందుకు మరో 15 రోజులు సమయం పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీచూడండి: రేపు భవిష్యత్​ కార్యాచరణ ప్రకటిస్తాం: అశ్వత్థామరెడ్డి

ABOUT THE AUTHOR

...view details