Modi schedule in hyderabad: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు భాగ్యనగరం సిద్ధమైంది. సమావేశాల నిమిత్తం.. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఆయా రాష్ట్రాల ముఖ్య నేతలు రాష్ట్రానికి చేరుకోగా.. ఈరోజు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నగరానికి చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ రానున్నారు. అయితే.. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు.
మోదీ హైదరాబాద్ పర్యటన.. 'మినిట్ టూ మినిట్' షెడ్యూల్ ఇదే..! - Modi minute to minute schedule
Modi schedule in hyderabad: హైదరాబాద్‌లో జరగనున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంతో.. ఆయన రేపు నగరానికి విచ్చేయనున్నారు. సమావేశాలతో పాటు మోదీ.. పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న బహిరంగ సభలోనూ పాల్గొంటారు. అయితే.. హైదరాబాద్ పర్యటన సందర్భంగా మోదీ షెడ్యూల్ ఎలా ఉండనుందంటే..!
Prime minister Modi minute to minute schedule in hyderabad Tour
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఇదే..
- శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో దిల్లీలో బయలుదేరి.. 2.55 గంటల సమయంలో హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.
- బేగంపేట నుంచి 3.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌కు బయలుదేరుతారు.
- 3.30 గంటలకు హెచ్‌ఐసీసీకి చేరుకుంటారు. 3.30 గంటల నుంచి 4 గంటల వరకు రిజర్వ్ సమయంగా ఉంచారు.
- సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో మోదీ పాల్గొంటారు. రాత్రి 9 గంటల నుంచి మిగతా సమయమంతా రిజర్వ్‌గా ఉంచారు.
- ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కార్యవర్గ భేటీలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 నుంచి 5.40 వరకు రిజర్వ్‌గా ఉంచారు.
- సాయంత్రం 5.55 గంటలకు హైటెక్స్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 6.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్తారు.
- సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు సభలో పాల్గొంటారు.
- రాత్రి 7.35 గంటలకు సభాస్థలి నుంచి బయలుదేరి.. రాజ్‌భవన్‌కు గానీ.. హోటల్‌కు గానీ చేరుకుని బస చేస్తారు.
- సోమవారం ఉదయం 9.20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో ఏపీకి బయలుదేరుతారు.
- ఉదయం 10.10 గంటలకు విజయవాడ చేరుకుని ఏపీలోని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఇవీ చూడండి: