తెలంగాణ

telangana

ETV Bharat / city

'శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ' - president office responds on seethanagaram sc tonsure case

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో సంచలనం రేపిన శిరోముండనం కేసులో మరో పరిణామం చోటుచేసుకుంది. కేసు దస్త్రాన్ని కేంద్ర సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలిచ్చింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ జరపాలని నిర్దేశించింది.

శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ
శిరోముండన బాధితుడి దస్త్రం సామాజిక న్యాయశాఖకు బదిలీ

By

Published : Aug 18, 2020, 9:38 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరం శిరోముండనం బాధితుడు ప్రసాద్​ కేసు దస్త్రాన్ని రాష్ట్రపతి కార్యాలయం సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర కేసుగా పరిగణించి సత్వర విచారణ చేపట్టాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్రపతి కార్యదర్శి అశోక్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

తనకు నక్సలైట్​గా మారేందుకు అవకాశం ఇవ్వాలని సీతానగరం శిరోముండనం బాధితుడు వరప్రసాద్​.. గతంలో రాష్ట్రపతికి లేఖ రాశాడు. ఈ లేఖపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. రాష్ట్ర జీఏడీ సహాయ కార్యదర్శి జనార్దన్​బాబుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. బాధితుడు ప్రసాద్​కు ఆయన్ను కలవాలని సూచించింది. అయితే జనార్దన్​బాబును కలిసినా.. సరైన స్పందన లేదని ప్రసాద్​ వాపోయాడు. ఈ క్రమంలో మరోసారి స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం.. కేసు దస్త్రాన్ని సామాజిక న్యాయశాఖకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details