రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్... ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు జిల్లా మదనపల్లిలో పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7న సత్సంగ్ పౌండేషన్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి రాక సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఉప పాలనాధికారి జాహ్నవి, డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, తదితరులు సత్సంగ్ పౌండేషన్కు వెళ్లి స్థల పరిశీలన చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సత్సంగ్ పౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీతో కలిసి హెలిప్యాడ్, రాష్ట్రపతి బస చేసే విడిది, తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
ఫిబ్రవరి 7న మదనపల్లికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ - చిత్తూరు జిల్లా మదనపల్లి వార్తలు
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7న సత్సంగ్ పౌండేషన్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.
ఫిబ్రవరి 7న మదనపల్లికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్