Pregnant woman in doli: ఏపీలోని అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో ఓ గర్భిణీకి డోలి మోత తప్పలేదు. సుమారు 9 కిలో మీటర్ల దూరం వరకు డోలిలోనే మోసుకెళ్లాల్సి వచ్చింది. కొయ్యూరు మండలం ములపేట పంచాయితీ పరిధిలోని జాజులబంద గ్రామానికి చెందిన పాంగి శాంతికి నెలలు నిండటంతో గ్రామం నుంచి డోలి మోతతో... దాదాపు 9 కిలో మీటర్లు నడిచి రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
గర్భిణీకి పురిటి నొప్పులు... 9 కిలోమీటర్లు డోలిలో మోసిన కుటుంబసభ్యులు... - ap latest news
Pregnant woman in doli: తరాలు మారాయి... ప్రభుత్వాలు మారుతున్నాయి... కానీ అణగారిన ప్రజల బతుకులు మాత్రం మారడంలేదు..! దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా... కిలో మీటర్ల మేర నడవాల్సిందే. ఆ నడిచే దారి కూడా సరిగా ఉండదు. ఆఖరికి మహిళలు ప్రసవం కోసమూ.. పురిటి నొప్పులను భరిస్తూ కిలో మీటర్ల కొద్దీ కాలినడకన వెళ్లాల్సిందే. తాజాగా ఓ గర్భిణీకి ఇదే పరిస్థితి ఎదురైంది. పురిటినొప్పులతో ఉన్న మహిళను డోలిలో మోసుకుంటా 9 కి.మీ మేర నడిచి... ఆస్పత్రికి చేర్చారు.!
Pregnant woman in doli
అక్కడ నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం.. వైద్యుల సూచన మేరకు విశాఖ నగరలోని కేజీహెచ్‌లో చేర్చారు. అక్కడ ఇవాళ తెల్లారుజామునే పండంటి పాపకు జన్మనిచ్చింది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా తమ తలరాతలు మారలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి:కాళ్లు పోయాయి... కష్టాలు మిగిలాయి... ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..