తెలంగాణ

telangana

ETV Bharat / city

నిండు గర్భిణీ.. నిర్భయంగా విధులు! - anm of k. majuvaram

ఆమె నిండు గర్భిణిీ అయినా వెరవకుండా కొవిడ్ విధులు నిర్వహిస్తుంది. పాజిటివ్​గా వచ్చిన వాళ్లకు ఆమె ధైర్యం చెబుతూ వచ్చారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తేనే నిజమైన సంతృప్తి అని అంటున్నారు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏఎన్ఎం వెంకటలక్ష్మి.

నిండు గర్భిణి.. నిర్భయంగా విధులు!
నిండు గర్భిణి.. నిర్భయంగా విధులు!

By

Published : Jun 12, 2021, 6:38 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కె.మంజువరం ఆరోగ్య ఉప కేంద్రం పరిధిలో అంకాని వెంకటలక్ష్మి ఏఎన్ఎంగా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల గర్భిణీ. అయినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా కొవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. వైరస్ బాధితులకు ధైర్యం చెబుతూ.. అవసరమైన వారిని ఆసుపత్రులకు పంపించడంలో వెంకటలక్ష్మి క్రియాశీలకంగా పని చేస్తున్నారు.

హోం ఐసోలేషన్​లో ఉన్నవారికి మందులు పంపిణీ చేయడం.. వైద్యులకు నివేదికలు ఇవ్వడం వంటి పనులు బాధ్యతగా చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తేనే నిజమైన సంతృప్తి అని అంటున్నారు ఏఎన్ఎం వెంకటలక్ష్మి.

ఇదీ చదవండి..PRC: ఉద్యోగులకు తీపికబురు... పీఆర్సీ అమలుపై ఉత్తర్వులు జారీ

ABOUT THE AUTHOR

...view details