హైదరాబాద్‌లో బుధవారం లీటర్ పెట్రో(petrol price in hyderabad)లు ధర రూ.110.46గా ఉంది. పరిస్థితులు చూస్తుంటే పెరగడమే తప్ప తగ్గేలా కనిపించడం లేదు. సరిగ్గా ఏడాది కిందట రూ.76.88 ఉంది. సంవత్సర కాలంలో దాదాపు 44 శాతం పెరిగింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబుకు పెట్రోలు చిల్లు పెడుతోంది. దీంతో వాహనదారులు పొదుపు చర్యల(precautions to save petrol)పై దృష్టిపెట్టారు. పలు చిట్కాలను పాటిస్తే కొంతైనా భారం తగ్గించుకోవచ్చు.
అలవాట్లు మారితే మంచిదే..
- పక్కగల్లిలో ఉండే కిరాణం, కూరగాయల దుకాణానికి వెళ్లాలన్నా బండి తీయడం చాలా మందికి అలవాటు. దగ్గరి దూరాలకు నడకను అలవాటు చేసుకోవడం అటు జేబుకు, ఇటు ఆరోగ్యానికి మంచిది.
- కొవిడ్‌కు ముందు బైక్(bike), కారు(car) షేరింగ్ విధానం అమల్లో ఉండేది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఒకే చోట బయలుదేరి వెళ్లినప్పుడు.. ఒక రోజు ఒకరి వాహనంలో వెళితే, మరో రోజు మరోకరి వాహనంలో వెళ్లోచ్చు.
- వారంలో ఒకరోజు కారు(car), బైకు(bike) వదిలి ప్రజా రవాణాలో వెళ్లడం అలవాటు చేసుకోవాలి. దీంతో రహదారులపై ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తగ్గుతాయి. పెట్రోల్ ఖర్చు తగ్గుతుంది.
- దూరప్రాంతాలకు వెళ్లేప్పుడు.. ప్రజారవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటే అందులోనే వెళ్లడం అన్ని విధాల ప్రయోజనకరం. ప్రమాదాల భయమూ ఉండదు.
- ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద వాహన ఇంజిన్ ఆపేయాలి. తద్వార కాలుష్యం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది
గాలి కూడా ముఖ్యమే..
- బైకు(bike)ల్లో రూ.500, కార్ల(car)లో రూ.2000 మేర పెట్రోల్ కొట్టించడం ఎక్కువ మందికి అలవాటు. అవసరం మేరకే పోయించడం ద్వారా ఎంత మైలేజీ ఇస్తుందో అవగాహన ఉంటుంది.
- ప్రస్తుతం ఇంట్లో ఎంత మంది ఉంటే అన్ని వాహనాలు ఉంటున్నాయి. అందరు ఒకే వాహనంలో కలిసి వెళితే ఇంధనం కలిసి వస్తుంది.
- ఎప్పటికప్పుడు టైర్లలో తగినంత గాలి ఉండేలా చూసుకోవాలి. మైలేజీ బాగా రావాలంటే ప్రతి చుక్క లెక్కలోకి రావాలి. అందుకు ఏ చిన్న విషయాన్ని విస్మరించొద్దు.
- వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. తద్వారా కార్ల(car), లో 6 శాతం ఇంధనం ఆదా అవుతుందన్నది ఆటోమొబైల్ నిపుణుల మాట. ద్విచక్రవాహనాల(bike)కు అంతే.
- చాలా మంది బైక్‌పై వెళ్లేప్పుడు ఎక్కువగా క్లచ్ పట్టుకుని ఉంటారు. కారు(car), లో సైతం క్లచ్‌పై కాలు బరువు మోపుతుంటారు. ఇలా చేస్తే వాహనాలు ఎక్కువ ఇంధనం తాగేస్తాయి.
- అత్యవసరంలో బ్రేక్ వేయవచ్చు కానీ.. అవసరం లేని చోటా వేస్తుంటారు. ఫలితంగా మైలేజీపై ప్రభావం పడుతుంది. టాప్ గేర్‌లో సాధారణ వేగంతో వెళితే మంచి మైలేజీ ఇస్తుంది.
- వచ్చేది చలికాలం. కాబట్టి కార్ల(car), లో ఏసీ లేకపోయినా పెద్దగా అసౌకర్యం ఉండదు. బయటి నుంచి వచ్చే గాలి సరిపోతుంది. ఏసీ వాడకపోతే మైలేజీ పెరుగుతుంది.