తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రజల మద్దతుతోనే కరోనా వైరస్​ వ్యాప్తి కట్టడి సాధ్యం' - కరోనా కట్టడికి జాగ్రత్తలు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్​ చైనాలో వెలుగు చూసి.. ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఈ మహమ్మారికి మందు కనిపెట్టేందుకు భారీ ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా సోకకుండా తీసుకోవాల్సిన మందుస్తు చర్యలేంటో తెలుసుకుందామా.

precautions to prevent corona virus
'ప్రజల మద్దతుతోనే కరోనా వైరస్​ వ్యాప్తి కట్టడి సాధ్యం'

By

Published : Mar 21, 2020, 3:03 PM IST

కరోనా వైరస్​ బారిన పడకుండా ఉండటానికి వ్యక్తిగత పరిశుభ్రత ఒక్కటే మార్గం కాదు. ఆహార విషయంలోనూ తప్పక జాగ్రత్తలు అవసరమని హోమియే, ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. జన సందోహం ఉండే ప్రాంతాల్లో మామిడి, వేప ఆకులు ఉంచడం ద్వారా వైరస్​ను అడ్డుకోవచ్చని తెలిపారు.

ప్రాసెస్డ్​ ఫుడ్, జంక్​ ఫుడ్​కి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత వరకు ఇంట్లో వండే ఆహారాన్నే తినాలని చెబుతున్నారు. రోజు తీసుకునే ఆహారంలో నట్స్, మాంసం, పండ్లు, పప్పులు, ఆకుకూరలు, పాలు, గుడ్లు వంటి వాటిని అధికంగా తీసుకోవాలని తెలుపుతున్నారు.

వ్యక్తిగత పరిశుభ్రత, సరైన ఆహారంతో కొంత వరకు వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని వైద్యులు వెల్లడించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తే తప్ప ఫలితం ఉండదంటున్నారు.

'ప్రజల మద్దతుతోనే కరోనా వైరస్​ వ్యాప్తి కట్టడి సాధ్యం'

ABOUT THE AUTHOR

...view details