తెలంగాణ

telangana

ETV Bharat / city

పీఆర్​సీ డిమాండ్లు ప్రజలకూ ఆమోదయోగ్యంగా ఉండాలి: మంత్రి శ్రీనివాసగౌడ్​ - telangana latest news

ఒక నెలలో 25 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనన్నారు.. మంత్రి శ్రీనివాస్​గౌడ్​. పీఆర్‌సీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌... ఉద్యోగులకు న్యాయం చేస్తారని మంత్రి భరోసానిచ్చారు.

srinivas goud
పీఆర్​సీ డిమాండ్లు ప్రజలకూ ఆమోదయోగ్యంగా ఉండాలి: మంత్రి శ్రీనివాసగౌడ్​

By

Published : Feb 3, 2021, 5:44 AM IST

ప్రభుత్వ ఉద్యోగులు పీఆర్‌సీ అడిగే విషయంలో ప్రజలకూ అమోదయోగ్యంగా ఉండాలని అబ్కారీ, యువజన, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. రాష్ట్ర ఆర్థిక, సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని డిమాండ్లు ఉండాలని కోరారు. 80 నుంచి 100 శాతం పీఆర్‌సీ కావాలని అడగటం సహేతుకం కాదన్నారు.

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నగర శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ-2021 ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత, నగరశాఖ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ

ఒక్కరితో ప్రారంభమైన సంఘం ఇవాళ వేలాది మందితో కూడిన గొప్ప అసోసియేషన్​గా ఏర్పాటైందన్నారు. మన గురించే కాకుండా పది మంది కోసం పనిచేస్తేనే చరిత్రలో నిలిచిపోతామన్నారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సంఘానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

చిన్న సమస్యలన్నీ త్వరలోనే పరిష్కారం అవుతాయని టీజీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా.. అంకితభావంతో పనిచేయాలని కోరారు.

వారి చరిత్రను బయటకు తీస్తాం..

మరుగున పడిపోయిన వాగ్గేయకారుల చరిత్రను వెలికితీసి పాఠ్యపుస్తకాల్లో చేర్చుస్తామని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది చరిత్ర మరుగున పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన నుంచి వారికి పూర్వవైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ కృషి చేస్తోందన్నారు.

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం, భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సరిత, జయకుమార్‌ రూపొందించిన 'తెలంగాణ వాగ్గేయకార వైభవం' అనే సీడీని మంత్రి ఆవిష్కరించారు. సాంస్కృతి శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీడీ రూపకర్తలు సరిత, జయకుమార్‌, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ వాగ్గేయకార వైభవం అనే సీడీ ఆవిష్కరణ

కూచిపూడి, భరతనాట్యం వంటి కళలకు మంచి పేరు వచ్చిందని.. వాగ్గేయకారుల చరిత్ర మాత్రం బయటకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎంతో మంది గొప్ప వాగ్గేయకారులు, సాహితీమూర్తులు, మేథావులు ఉన్నారని.. వారందరి చరిత్రను వెలికితీస్తామని మంత్రి పేర్కొన్నారు.

ఇవీచూడండి:తుదిదశకు పీఆర్​సీ.. నివేదిక ఆధారంగా సీఎం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details