రాష్ట్ర మొదటి వేతన సవరణ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పీఆర్సీ ఛైర్మన్ సీఆర్ బిస్వాల్, కమిషనర్ మహ్మద్ అలీ రఫత్... సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు నివేదిక అందించారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఉద్యోగసంఘాల నేతలు, ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన పీఆర్‌సీ కమిటీ - తెలంగాణ పీఆర్సీ వార్తలు
17:04 December 31
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన పీఆర్‌సీ కమిటీ
2018 మే 18న తెలంగాణ తొలి వేతన సవరణ సంఘాన్ని ముగ్గురు కమిషనర్లతో రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మూడు నెలల కాలానికి మొదట కమిటీని నియమించిన ప్రభుత్వం... ఆ తర్వాత పలు దఫాలుగా గడవును పొడిగిస్తూ వచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కమిటీ ఇవాళ తన నివేదికను సమర్పించింది. నివేదిక సమర్పణతో ఉద్యోగుల్లో అపోహలు, భయాలు పోయాయని ఉద్యోగసంఘాల నేతలు తెలిపారు. మంచి పీఆర్సీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలను కమిటీ నివేదికపై సీఎస్ సోమేశ్ కుమార్ చర్చలకు పిలుస్తారని వారు తెలిపారు.
అధ్యయనం తర్వాత తుది నిర్ణయం: సీఎస్
పీఆర్సీ కమిషన్ నివేదికను అధ్యయనం చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు అధికారుల కమిటీతో సమావేశమవుతామన్నారు. జనవరి రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో కమిటీ చర్చలు జరుపుతుందన్నారు. వేతన సవరణను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం చెప్పారని సీఎస్ వెల్లడించారు.
ఇదీ చదవండి :జనవరిలోనే పదోన్నతులు, వేతన సవరణ: సీఎం కేసీఆర్