జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడిలో వీర మరణం పొందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ, సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెలో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భౌతికకాయానికి పలువురు నేతలు నివాళులర్పించారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంతిమయాత్రలో స్థానికులు భారీగా పాల్గొన్నారు.
అధికారిక లాంఛనాలతో ముగిసిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు - Praveen Kumar Reddy news
జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లా రెడ్డివారి పల్లెకు చెందిన ఆర్మీ జవాను ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ వేకువజామున ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. వీర జవానును కడసారి చూసేందుకు రెడ్డివారిపల్లెకు ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాదిమంది అశ్రునయనాల మధ్య అధికారిక లాంఛనాలతో ప్రవీణ్ కుమార్‌రెడ్డి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
అధికారిక లాంఛనాలతో ముగిసిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అంత్యక్రియలు
అంత్యక్రియల సమయంలో ప్రవీణ్ భార్య రజిత విలపించిన తీరు అక్కడున్నవారికి కంటతడి పెట్టించింది. అంతకుముందు జవాన్ ఇంటి నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ప్రవీణ్ పార్థివదేహానికి జిల్లా కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా, ఆర్డీవో రేణుక, తహసీల్డార్ బెన్ను రాజు తదితరులు నివాళులు అర్పించారు.
ఇదీ చదవండీ..అశ్రునయనాల మధ్య వీరజవాన్ మహేశ్ అంత్యక్రియలు