ఏపీలోని పట్టిసీమతో పాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో 10 గేట్లను జలవనరుల శాఖ అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వస్తున్న 19 వేల క్యూసెక్కుల నీటిని యథాతధంగా కిందికి వదులుతున్నారు.
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఏపీలోని పట్టిసీమతో పాటు ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో 10 గేట్లును ఆ రాష్ట్ర జలవరుల శాఖ అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
prakasham barrage
మొత్తం 10 గేట్లను ఎత్తి సముద్రంలోకి 7,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో 10,600 వేల క్యూసెక్కుల నీటిని ఏలూరు, బందరు, రైవస్ కాలువల ద్వారా డెల్టా వ్యవస్థకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3.07 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు వెల్లడించారు.
ఇదీ చదవండి :అమ్మలా ఆదుకుంటాయనుకున్న ఆశ్రమాలే... అత్యాచారాలకు నిలయాలుగా...