తెలంగాణ

telangana

ETV Bharat / city

Prakash Raj With KCR: కేసీఆర్ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా ప్రకాశ్​రాజ్​.. అందుకోసమేనా?

Prakash Raj With KCR: సీఎం కేసీఆర్​ ముంబయి పర్యటనలో నటుడు ప్రకాశ్​రాజ్​ సెంటర్​ ఆఫ్​ అట్రాక్షన్​గా నిలిచారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి పర్యటన ముగించుకుని తిరిగి వెళ్లే వరకు కేసీఆర్​ వెంటే ఉండి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంతకూ.. కేసీఆర్​ పర్యటనలో ఎవరూ ఊహించని విధంగా.. ప్రకాశ్​రాజ్​ ఇంత చురుకుగా పాల్గొనటానికి కారణాలేంటీ..?

Prakash Raj is main attraction in CM KCR Mumbai tour
Prakash Raj is main attraction in CM KCR Mumbai tour

By

Published : Feb 20, 2022, 8:37 PM IST

Updated : Feb 21, 2022, 6:55 AM IST

Prakash Raj With KCR: సీఎం కేసీఆర్​ ముంబయి పర్యటనలో భాగంగా మహరాష్ట్ర సీఎం ఉద్ధవ్​ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ ​పవార్​ను కలిశారు. జాతీయ రాజకీయాలపై లోతుగా చర్చించారు. కాగా.. ఈ పర్యటనలో అందరి చూపు ఇప్పుడు నటుడు ప్రకాశ్​​రాజ్​పై పడింది. ముంబయికి ఆహ్వానించిన ఉద్ధవ్​ ఠాక్రేతో భేటీ అయి.. అటునుంచి అటు శరద్​పవార్​ను కలిసేందుకు సీఎం కేసీఆర్​ వెళ్తున్నట్టు అందరికి తెలుసు. ఈ పర్యటనలో భాగంగా.. కొంత మంది ఆయా పార్టీల నాయకులు వెంట ఉంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ.. అనూహ్యంగా ఈ పర్యటనలో ప్రకాశ్​రాజ్​ మెరవటం.. అందరి దృష్టిని ఆకర్షించింది.

గ్రాండ్​ హయాత్​లో కేసీఆర్​కు స్వాగతం పలుకుతూ..

మొదటి నుంచి కేసీఆర్​ వెంటే..

సీఎం కేసీఆర్​ ముంబయికి రాగా.. గ్రాండ్​ హయాత్​లో ప్రకాశ్​రాజే స్వయంగా సాదర​ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఉద్ధవ్ ​ఠాక్రే నివాసానికి కేసీఆర్​ వెంటే వెళ్లారు. వాళ్లతో భేటీ అయ్యారు. అటు నుంచి శరద్​పవార్​ను కలిసేందుకు వెళ్లినప్పుడు కూడా కేసీఆర్​ వెంటే ఉన్న ప్రకాశ్​రాజ్​.. వారితోనూ సమావేశమయ్యారు. భేటీల తర్వాత నిర్వహించిన మీడియా సమావేశాల్లోనూ పాల్గొన్నారు కూడా. అన్ని ముగించుకుని తిరిగి హోటల్​కు వెళ్తున్నప్పుడు సైతం.. కేసీఆర్​ కాన్వాయ్​లోనే ప్రకాశ్​రాజ్​ వెళ్లారు. స్వాగతం పలకటం దగ్గర్నుంచి వీడ్కోలు వరకు ఈ పర్యటనలో మొత్తం కేసీఆర్​ వెంటే ప్రకాశ్​రాజ్​ ఉన్నారు.

ఉద్ధవ్ ఠాక్రేతో కేసీఆర్​ భేటీ అయిన సందర్భంగా..

అప్పటి నుంచి భాజపాకు వ్యతిరేకంగానే..

మొదటి నుంచి ప్రకాశ్​రాజ్.. భాజపాకు వ్యతిరేఖంగా మాట్లాడుతున్నారు. 2017లో గౌరీలంకేశ్​ ఘటన జరిగినప్పటి నుంచి ప్రకాశ్​రాజ్​ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. జస్ట్​ ఆస్కింగ్​(#JUSTASKING) అనే హాష్​ట్యాగ్​తో తన ప్రశ్నలను ఎప్పటికప్పుడు సంధిస్తూనే ఉన్నారు. 2019లో బెంగళూరు పార్లమెంట్​ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇలా ఎప్పటికప్పుడు భాజపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ప్రకాశ్​రాజ్​.. ఇవాళ్టి కేసీఆర్​ పర్యటనలో ఎవరూ ఊహించకుండా మెరవటం చర్చనీయాంశంగా మారింది.

శరద్​పవార్, ఆయన కూతురు​తో కేసీఆర్​ బృందంలో ప్రకాశ్​రాజ్​

అందుకే కేసీఆర్​తో భేటీ..

కేంద్రంపై సీఎం కేసీఆర్​ నిప్పులు చెరగటం.. దేశంలో ఉన్న సమస్యలపై గళమెత్తటం.. కేంద్రంలో భాజపా, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని తీసుకురావలన్న ప్రతిపాదన.. అందుకోసం ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు పూనుకోవటం.. లాంటి అంశాలు ప్రకాశ్​రాజ్​ను ఈ భేటీల్లో పాల్గొనేలా చేసుంటాయి! రాజకీయంగా ​కేసీఆర్​ వ్యూహాలు.. తన రాజకీయ ఆలోచనలకు దగ్గరగా ఉన్నట్టు భావించటం వల్లే తనను కలిసుండవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. భాజపాపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్​ను కలిసేందుకు.. జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పుల గురించి చర్చించేందుకు ఇదే అనువైన సమయంగా ప్రకాశ్​రాజ్​ భావించి ఉంటారని భావిస్తున్నారు!

కేసీఆర్​, శరద్​ పవార్​తో ప్రకాశ్​రాజ్​

ఇవీ చూడండి:

Last Updated : Feb 21, 2022, 6:55 AM IST

ABOUT THE AUTHOR

...view details