తెలంగాణ

telangana

ETV Bharat / city

మద్యంలో సైనేడ్... తమ్ముడి హత్యకు అక్కస్కెచ్​ - కంభం హత్య కేసు

రాఖీ కట్టి దీవించాల్సిన అక్కే తమ్ముడి ప్రాణం తీసేందుకు వెనుకాడలేదు. ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికులను నివ్వెరపరిచింది. బావమరిది బాగు కోరాల్సిన బావే దీనికి పథకం రచించాడు.

prakasam-district-kambam-murder-mystery-revealed
మద్యంలో సైనేడ్... వ్యక్తి హత్యకు అక్క, బావ స్కెచ్​

By

Published : Oct 2, 2020, 10:58 PM IST

గత నెల 20న ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కంభం సమీపంలోని చెరువు కట్టపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వెంకట శివ ప్రసాద్ కేసును పోలీసులు ఛేదించారు. మద్యానికి బానిసై.. ఉన్న ఆస్తిని పాడుచేస్తున్నాడని అతని అక్క, బావలే మరో వ్యక్తితో కలిసి హతమార్చారని డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. పక్కా ప్రణాళికతో.. మద్యంలో సైనేడ్ కలిపి తాగించారని వివరించారు. ఆస్తి దక్కుతుందన్న ఆశతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్​కు పంపించారు. నిందితులను త్వరగా పట్టుకున్న ఎస్​ఐతో సహా సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ఇదీ చదవండి:ప్రజాప్రతినిధులతో రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details