తెలంగాణ

telangana

ETV Bharat / city

pro kabaddi Auction: ప్రదీప్‌ నర్వాల్‌కు రూ.1.65 కోట్లు.. దక్కించుకున్న యూపీ యోధ - యూపీ యోధ

ముంబయిలో నిర్వహించిన ప్రొ కబడ్డీ వేలం​లో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యూపీ యోధ జట్టు పీకేఎల్‌ వేలంలో సోమవారం అతణ్ని రికార్డు స్థాయిలో రూ 1.65 కోట్లకు సొంతం చేసుకుంది.

pro kabaddi auction
ప్రొ కబడ్డీ ఆక్షన్​లో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌

By

Published : Aug 31, 2021, 12:51 PM IST

ముంబయిలో నిర్వహించిన ప్రొ కబడ్డీ వేలంలో స్టార్‌ ఆటగాడు ప్రదీన్‌ నర్వాల్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. యూపీ యోధ జట్టు పీకేఎల్‌ వేలంలో సోమవారం అతణ్ని రికార్డు స్థాయిలో రూ 1.65 కోట్లకు సొంతం చేసుకుంది. రాహుల్‌ చౌదరిని కేవలం రూ.40 లక్షలకు పుణెరి పల్టాన్‌ కొనుక్కోగలిగింది.

సిద్ధార్థ్‌ దేశాయ్‌ను తెలుగు టైటాన్స్‌ రూ.1.30 కోట్లతో అట్టిపెట్టుకుంది. మంజీత్‌ను రూ.92 లక్షలకు తమిళ తలైవాస్‌ చేజిక్కించుకుంది. సచిన్‌ (రూ.84 లక్షలు)ను పట్నా పైరేట్స్‌, రోహిత్‌ గులియా (రూ.83 లక్షలు)ను హరియాణా స్టీలర్స్‌, సుర్జీత్‌ సింగ్‌ (రూ.75 లక్షలు)ను తమిళ్‌ తలైవాస్‌, రవిందర్‌ పాహల్‌ (రూ.74 లక్షలు)ను గుజరాత్‌ జెయింట్స్‌ కొనుగోలు చేశాయి. వేలం మంగళవారం కూడా కొనసాగనుంది.

ఇదీ చూడండి:Tokyo Paralympics: షూటింగ్​లో భారత్​కు మరో పతకం

ABOUT THE AUTHOR

...view details