తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుదేవా సంచలన నిర్ణయం.. కారణం అదే..! - prabhudeva

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్.. ఏ పరిశ్రమలోనైనా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు ప్రభుదేవా. ఆయన ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలు విజయవంతం కాలేదు. దీంతో ఇకపై డైరెక్షన్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం నటనపైనే పూర్తి దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ప్రభుదేవా
ప్రభుదేవా

By

Published : Sep 21, 2021, 12:58 PM IST

ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా పేరొందిన ప్రభుదేవా ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన పలు సినిమాలు విజయవంతం కాలేదు. దీంతో ఇకపై తాను దర్శకత్వం వహించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తొలుత పరిశ్రమలో కొరియోగ్రఫర్​గా అడుగుపెట్టిన ఆయ‌న.. అన‌తి కాలంలోనే ఒక కొత్త ట్రెండ్​ సెట్ చేశాడు. ప్రభుదేవా వ‌రుస విజ‌యాల‌తో కొరియోగ్రాఫర్​గా అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అనంత‌రం చిన్నచిన్న‌ రోల్ చేస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. త‌రువాత ప‌లు చిత్రాల్లో హీరోగా కూడా న‌టించారు.

డైరెక్ష‌న్ పైనున్న‌ ఆస‌క్తితో దర్శకుడిగా మారాడు ప్రభుదేవా. ప‌లు భాషల చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగులోనూ ఎమ్మెస్ రాజు బ్యానర్లో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆ తరువాత బాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. హిందీలో స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. వరుసగా సినిమాలు చేసి అక్కడ బిజీ డైరెక్టర్‌గా మారాడు. హీరోలతో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్‌ను అందుకున్నాడు.

అయితే ఈ మధ్య ప్రభుదేవా చేసిన చిత్రాలు అనుకున్న విజయాలు సాధించ‌లేకపోతున్నాయి. సల్మాన్ ఖాన్‌తో చివరగా చేసిన రాధే సినిమా అభిమానులను దారుణంగా నిరాశపరిచింది. దీంతో ప్రభుదేవా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇకపై డైరెక్షన్ చేయకూడదని గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకున్న‌డని సన్నిహుతుల సమాచారం. నటన పైనే పూర్తి దృష్టి పెట్టాడని వారు చెబుతున్నారు. నటుడిగా వరుస అవకాశాలు వస్తున్న కారణంగానే ఆయన ఈ నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన భగీరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.

ఇదీ చదవండి:selfie video while commiting suicide: 'నా భార్య హెడ్​ కానిస్టేబుల్​తో ఆ బంధం కొనసాగిస్తోంది'

ABOUT THE AUTHOR

...view details