తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇదేందయ్యా ఇది.. 'స్పిరిట్​' సినిమాకు ప్రభాస్ రెమ్యూనరేషన్ అంతనా..! - ప్రభాస్

ప్రభాస్​ తన 25 చిత్రం 'స్పిరిట్​' కోసం భారీగా రెమ్యూనరేషన్​ తీసుకోనున్నట్లు ఓ వార్త సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకోనున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

spirit
spirit

By

Published : Oct 17, 2021, 2:55 PM IST

'బాహుబలి' సినిమాలతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన యంగ్​ రెబల్​స్టార్ ప్రభాస్.. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో అన్ని పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే పలు సినిమాలను లైన్​లో పెట్టారు. ఇక తాజాగా తన 25వ సినిమాను 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి 'స్పిరిట్' అనే టైటిల్​ను కూడా ఖరారు చేశారు.


అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ.150 కోట్ల పారితోషికం అందుకోనున్నాడని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో చూడాలి మరి.


ఇదీ చూడండి:Love story ott: ఓటీటీలో 'లవ్​స్టోరి'.. ఆరోజే రిలీజ్​

ABOUT THE AUTHOR

...view details