Asian Powerlifting Championship: టర్కీలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి సత్తా చాటింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మస్ 57 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది.
Asian Powerlifting Championship: ఆసియా పవర్ లిఫ్టింగ్‌లో ఏపీ యువతికి బంగారు పతాకం - ఆసియా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి యువతికి బంగారు పతకం
Asian Powerlifting Championship: టర్కీలో జరుగుతున్న ఆసియా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్లో తెలుగు యువతి సత్తా చాటింది. 57 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాదియా అల్మస్ బంగారు పతకాన్ని సాధించింది.
టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 57 కేజీల విభాగంలో స్క్వాడ్- 167.5 కేజీలు, బెంచ్ ప్రెస్- 70 కేజీలు, డెడ్ లిఫ్ట్ 157.5 కేజీలు మొత్తంగా 395 కేజీలు బరువు ఎత్తిన సాదియా అగ్రస్థానంలో నిలిచింది. స్క్వాడ్, డెడ్ లిఫ్ట్‌లలో రెండు స్వర్ణాలు, బెంచ్ ప్రెస్ లో రజత పతకం సాధించిన సాదియా అల్మస్.. ఓవరాల్‌గా స్వర్ణాన్ని చేజిక్కించుకుంది. 2004లో జంషెడ్ పూర్లో జరిగిన ఏషియన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్లో 90 కేజీల విభాగంలో తన తండ్రి షేక్ సంధాని సిల్వర్ మెడల్ సాధించారు.
ఇదీచూడండి:IND vs SA test: టీమ్ఇండియా కల.. ఈసారైనా నెరవేరేనా?