తెలంగాణ

telangana

ETV Bharat / city

"విద్యుత్‌ సవరణ బిల్లు'తో తీరని నష్టం" - విద్యుత్ సవరణ బిల్లు 2020ని వ్యతిరేకిస్తూ విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

2020 విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. మింట్‌ కాంపౌండ్ లోని ఎస్పీడీసీఎల్‌ కార్యాలయం విద్యుత్ సౌధలో రాష్ట్ర పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్న జేఏసీ నేతలతో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్‌ ముఖామూఖి

'విద్యుత్‌ సవరణ బిల్లు 2020 పేదలకు నష్టం'
'విద్యుత్‌ సవరణ బిల్లు 2020 పేదలకు నష్టం'

By

Published : Jun 1, 2020, 4:32 PM IST

విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూవిద్యుత్ ఉద్యోగుల నిరసన

ప్రశ్న: నిరసనకు గల ప్రధాన కారణమేంటి?

సమాధానం: విద్యుత్ సవరణ బిల్లు ద్వారా రాష్ట్రాలకున్న అధికారాలను కేంద్రం తన చేతులోకి లాక్కుంటుంది. విద్యుత్‌ సంస్థలను ప్రైవేట్‌పరం చేయడమే బిల్లు ముఖ్య ఉద్దేశం. బిల్లు ఆమోదం పొందింతే పేదలకు, రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సబ్సిడి పోయి అధిక ధరకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీని ద్వారా ఉద్యోగులకు కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి కేంద్రం దీన్ని వెంటనే బిల్లు వెనక్కి తీసుకోవాలి.

ప్రశ్న: రైతులకు సబ్సిడీ చెల్లిస్తామని కేంద్రం చెబుతోంది. దీనిపై మీరేమంటారు?

సమాధానం: రైతులకు సబ్సిడి కేంద్రం చెల్లించదు. రాష్ట్రమే చెల్లించాలి. సరైన సమయంలో విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే వినియోగదారులకు విద్యుత్‌ సరఫరా ఆపివేయడం జరుగుతుంది. ఫలితంగా రైతులు పంటకు నష్టం వాటిల్లే ప్రమాదముంది. ఈ సబ్సిడి కూడా భూ యజమానులకు వెళ్తుంది. కౌలు రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు.

ప్రశ్న: విద్యుత్‌ ఉద్యోగులకు ఈ బిల్లు ఏ విధంగా నష్టం?

సమాధానం: విద్యుత్ సంస్థల్లో పనిచేయాలంటే కొన్ని ప్రమాణాల ఆధారంగా నియామకం జరుగుతుంది. ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది. ప్రైవేట్‌కు కట్టబెడితే ఈ నిబంధనలు వర్తించవు. ఇంత మంది కార్మికులు అవసరంలేదని వారిని తొలగించడం జరుగుతుంది. తద్వారా మిగిలిన వారిపై భారం పడుతుంది. వినియోగదారులకు కూడా సకాలంలో సేవలు అందించలేరు.

ప్రశ్న: ప్రైవేట్‌ వారికి అప్పగిస్తే జవాబుదారీతనం పెరుగుతుంది. ప్రమాణాలకు అణుగుణంగా విద్యుత్‌ను అందిస్తామని కేంద్రం చేబుతుంది. దీన్ని ఎలా చూడాలి?

ప్రైవేటు ద్వారా జవాబుదారితనం పెరుగుతుందనడం ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే అంఫన్‌ తుఫాను ప్రభావంతో పశ్చిమబంగాల్‌ రాజధాని కోల్‌కతాలో విద్యుత్‌ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడ ఇప్పటికే విద్యుత్‌ను ప్రైవేట్‌ పరం చేశారు. తుఫాను పోయి ఇన్ని రోజులైన అక్కడ చాలా ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా లేదు. మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే విద్యుత్‌ను పునరుద్ధరించింది. ప్రైవేట్‌ వారు మాత్రం మాకు ప్రభుత్వం డబ్బులిస్తే కాని మేము పనులు చేయలేమని చేతులెత్తేశారు. వారు లాభాల కోసం పని చేస్తారు. మేము సమాజ శ్రేయస్సుకోసం పనిచేస్తాం.

ఇవీ చూడండి:ఎవరి బలాబలాలు ఏందో మైదానంలో తేల్చుకుందాం: రేవంత్

ABOUT THE AUTHOR

...view details