AP Power cut: ఏపీలో నూతనంగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోజూ మధ్యాహ్నం వేళల్లో విద్యుత్ నిలిపివేస్తున్నారని.. దీని వల్ల ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. ఒక పక్క వేసవితాపం మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యుత్ ఛార్జీల వడ్డనపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
AP Power cut: ఏపీలో అనధికారిక విద్యుత్ కోతలు - power cut in anakapally district
AP Power cut: ఏపీలో అనధికారిక విద్యుత్ కోతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాంటి సమాచారం లేకుండా గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపివేయడంతో... చంటిపిల్లలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా సరఫరా నిలిపేయడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
Power