పురపాలక ఎన్నికల్లో విధులు నిర్వర్తించే పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోమారు విజ్ఞప్తి చేసింది. దాదాపు 55వేల మంది సిబ్బందికి పోలింగ్ కోసం విధులు కేటాయించగా... ఇప్పటి వరకు కేవలం 380 మంది మాత్రమే ఆన్లైన్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. అందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆన్లైన్ ద్వారా కూడా పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించామని ఈసీ తెలిపింది. కానీ సిబ్బంది నుంచి ఆశించిన మేర స్పందన లేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు లభించని స్పందన - పుర ఎన్నికలు
పోలింగ్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆన్లైన్ ద్వారా అవకాశాన్ని కల్పించినా ఆశించిన మేర స్పందన లేదని ఈసీ ఆవేదన వ్యక్తం చేసింది.
పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు లభించని స్పందన
సాధారణ ఓటర్లతో పోలిస్తే పోలింగ్ అధికారులు ఓటింగ్ పట్ల అంతగా ఆసక్తి చూపడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని... ఇది సంతృప్తికర పరిమాణం కాదని వ్యాఖ్యానించింది. పోలింగ్ సిబ్బంది అందరూ టీపోల్ సాఫ్ట్వేర్ ద్వారా తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మరోమారు విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి: భాజపాకు ఎందుకు ఓటెయ్యాలి : కేటీఆర్