ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం పూతరేకులపై భారత తపాలాశాఖ పోస్టల్ కవర్ రూపొందించింది. ఆత్రేయపురం కార్యాలయం వద్ద విశాఖపట్నం రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ముత్యాల వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఈ పోస్టల్ కవర్ ఆవిష్కరించారు. ఆత్రేయపురం పూతరేకులకు ఏళ్ల చరిత్ర ఉంది. ఇక్కడ వీటి తయారీపై 500 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.
POSTAL COVER: ఆత్రేయపురం పూతరేకులకు గుర్తింపు.. పోస్టల్ కవర్ విడుదల - ap latest news
ఆత్రేయపురం పూతరేకులపై తపాలాశాఖ పోస్టల్ కవర్ విడుదల చేసింది. ఏపీ విశాఖ రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు దీనిని ఆవిష్కరించారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్ కవర్ అందుబాటులో ఉండనుంది. పూతరేకుల పోస్టల్ కవర్ ధర రూ.20 అని పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
పోస్టల్ కవర్ విడుదల
ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో ప్రధాన తపాలా కార్యాలయాల్లో పూతరేకుల పోస్టల్ కవర్ అందుబాటులో ఉండనుంది. పూతరేకుల పోస్టల్ కవర్ ధర రూ.20 అని పోస్ట్‌మాస్టర్ జనరల్ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇదీ చదవండి:KTR: 'రైతుల శ్రేయస్సు పట్ల తెరాస ప్రభుత్వం నిబద్ధతతో ఉంది'