కరోనా నియంత్రణలో భాగంగా ఏపీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. అయితే ఈ నెల 14వ తేదీతో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుండడం వల్ల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏపీలో కర్ఫ్యూ ఎత్తివేతకు అవకాశం! - ఏపీ వార్తలు
ఏపీలో ఈ నెల 14వ తేదీతో ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ గడువు ముగియనుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న కర్ఫ్యూ సడలింపులను పూర్తిగా ఎత్తివేయాలన్న ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

night curfew
రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతుండడం, రోజువారీ కేసులు తగ్గుతుండడం కారణంగా రాత్రి కర్ఫ్యూ ఎత్తివేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువవుతుండడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగించి.. మిగిలిన జిల్లాల్లో కర్ఫ్యూను పూర్తిస్థాయిలో ఎత్తేసే అవకాశాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: పెరిగిన కొత్త కేసులు- మరో 41,195మందికి కరోనా