రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షం పడే అవకాశం ఉందని వివరించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రాగల మూడ్రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు
రాగల మూడ్రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ప్రకటించారు.
తెలంగాణలో వర్షాలు, తెలంగాణలో వాతావరణం, తెలంగాణ వెదర్ అప్డేట్స్
ఉపరితల ద్రోణి మరట్వాడా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి ఒకటిన్న కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని వెల్లడించింది. ఉత్తర-తూర్పు ఉపరితల ఆవర్తనం మరట్వాడా నుంచి కర్ణాటక ప్రాంతం మీదగా దక్షిణ కోస్తా తమిళనాడు వరకు సముద్ర మట్టానికి ఒకటిన్నర కిలో మీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని వివరించింది. వీటి ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
- ఇదీ చదవండి :మానేరు వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు