నైరుతి ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి తెలిపారు. దీనికి అనుబంధంగా 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించారు. ఇది ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి దిశగా వంపు తిరుగుతుండటం వల్ల తెలంగాణలో రాగల మూడ్రోజుల వరకు వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు మోస్తరు వర్షాలు - telangana weather updates
నైరుతి ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతున్నందున తెలంగాణలో శుక్రవారం.. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
రాష్ట్రంలో రాగల మూడ్రోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకుడు తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగామ, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ -పట్టణ, వరంగల్-గ్రామీణ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.