తెలంగాణ

telangana

ETV Bharat / city

Perni Nani On New District: ఏపీలో 26 జిల్లాలతోపాటు మరో కొత్త జిల్లా? - గిరిజనుల కోసం ప్రత్యేక జిల్లా

Perni Nani On New District: గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లా ఉండాలన్న ఆలోచన ఏపీ సీఎం జగన్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాలతో పాటు మరో గిరిజన జిల్లా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Perni Nani
Perni Nani

By

Published : Apr 5, 2022, 11:00 PM IST

Perni Nani On New District: ఏపీలో కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాలతో పాటు గిరిజన ప్రాంతాలన్నీ కలిపి ఒకే జిల్లా ఉండాలన్న ఆలోచన ఏపీ సీఎం జగన్ చేస్తున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. రానున్న రోజుల్లో మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లిబిడ్డ ఎక్స్​ప్రెస్ వాహనాలను, దాతల విరాళాలతో ఏర్పాటు చేసిన వెయ్యి లీటర్ల సామర్థ్యం కలిగిన ఆర్​వో వాటర్ ఫ్లాంట్​ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు.

'గిరిజన ప్రాంతాలన్నీ ఒకే జిల్లాగా ఉండాలని సీఎం ఆలోచన. 26 జిల్లాలకు అదనంగా మరో జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో గిరిజనుల కోసం జిల్లా ఏర్పాటయ్యే అవకాశం ఉంది.' - పేర్ని నాని, మంత్రి

గడిచిన మూడేళ్ల పాలనలో ప్రజలకు ఎంతో చేరువగా తమ ప్రభుత్వం పని చేసిందని పేర్ని నాని వెల్లడించారు. రాష్ట్రంలోని 11 మెడికల్ కాలేజీకు అదనంగా మరో 16 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ బడుల బాట పట్టే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

ఇదీ చదవండి:చండీగఢ్‌పై హరియాణా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

ABOUT THE AUTHOR

...view details