వ్యవసాయేతర ఆస్తుల 'ధరణి' రిజిస్ట్రేషన్ ఆలస్యమయ్యే అవకాశం - ధరణి పోర్టల్
18:51 November 21
వ్యవసాయేతర ఆస్తుల 'ధరణి' రిజిస్ట్రేషన్ ఆలస్యమయ్యే అవకాశం
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం అయ్యేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం రిజిస్ట్రేషన్ల ప్రారంభం కోసం కసరత్తు చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అనుసరించాల్సిన పద్ధతులపై హైకోర్టులో దాఖలైన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే విధించింది.
ఈ నెల 23న ఈ అంశంపై హైకోర్టు మరోమారు విచారించనుంది. హైకోర్టు నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే తప్ప ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు ప్రారంభించే అవకాశం లేదు. దీంతో 23వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మరో మూడు, నాలుగు రోజుల పాటు వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇవీ చూడండి: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపుహౌస్ పునరుద్ధరణ