తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆన్​లైన్​ క్లాసులో అశ్లీలత! - ఆన్​లైన్​ క్లాసులు

ఆన్​లైన్​ పాఠాలు ప్రారంభించిన ఓ స్కూల్​ యాజమాన్యం షాక్​కు​ గురైంది. క్లాస్​ మొదలైన కాసేపటికి అశ్లీల చిత్రాలు ప్లే అయ్యాయి. వెంటనే యాజమాన్యం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పుణెలో జరిగింది.

online class
online class

By

Published : Aug 4, 2021, 6:42 AM IST

ఆన్​లైన్​లో తరగతులు నిర్వహిస్తున్న ఓ ప్రైవేటు స్కూలు ఎప్పటిలాగే విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు సిద్ధమైంది. అయిదో తరగతి విద్యార్థులకు క్లాసు ప్రారంభమైన కొంతసేపటికే పోర్న్​ వీడియో ప్లే అయింది. దీంతో టీచ‌ర్లు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు షాక్ అయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర పుణెలోని రాజ్‌గురున‌గ‌ర్‌లో శుక్రవారం జరిగింది.

ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసింది. పిల్లలకు యాజమాన్యం పంపిన లాగిన్​ వివ‌రాల‌ను ఎవ‌రో బ‌య‌టి వాళ్ల‌కు షేర్ చేసి ఉంటారని, వారే ఈ పని చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసును సైబర్​ దర్యాప్తు బృందానికి బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:దివ్యాంగురాలైన బాలికపై లైంగికదాడి.. హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details