'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'
అసంతృప్తి నాయకులను భాజపాలో చేర్చుకుని పార్టీ బలపడిందంటే ఎలా అని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. తెరాస మీద వ్యతిరేకతతోనే కమలం పార్టీ ఎంపీ సీట్లను గెలిచింది కానీ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు కాదన్నారు.
'దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చండి'
కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా తెలంగాణ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాల్సిందిపోయి రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఫిరాయింపులు ప్రోత్సహిస్తోందని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ విమర్శించారు. శాసనసభ ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని భాజపా తెరాసకు ప్రత్యామ్నాయం తామే అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. భాజపాకు దమ్ముంటే విభజన హామీలు నెరవేర్చాలని సవాల్ చేశారు.
- ఇదీ చూడండి : 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'కు మహేశ్ కితాబు