తెలంగాణ

telangana

ETV Bharat / city

కొవిడ్ మరణాలపై హెచ్​ఆర్​సీకి పొన్నం ఫిర్యాదు - ponnam prabhakar concern on corona deaths in telangana

ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సరైన చికిత్స అందక ఇద్దరు కరోనా బాధితులు చనిపోయారని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మనకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ponnam prabhakar give a complaint to human rights commission on covid death in telangana
కొవిడ్ మరణాలపై హెచ్​ఆర్​సీకి పొన్నం ఫిర్యాదు

By

Published : Jun 29, 2020, 12:00 AM IST

రాష్ట్రంలో కరోనాకు సరైనా చికిత్స అందకపోవడంతో ఆదివారం ఇద్దరు కొవిడ్‌ బాధితులు చనిపోయారని రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మనకు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌ ఛాతీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో ఆక్సిజన్ అందక తాను చనిపోతున్నట్లు ఓ వీడియో ద్వారా కుటుంబీకులకు కరోనా బాధితుడు తెలియజేశాడని, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నిజాంపేట గ్రామానికి చెందిన ఎనిమిది నెలల బాలుడికి గాంధీ ఆస్పత్రిలో వైద్యం అందక మరణించాడన్నారు. ఈ రెండు అంశాలపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి క్లిపింగ్‌లను కూడా తన లేఖతో పాటు పంపినట్లు పొన్నం పేర్కొన్నారు.

రాష్ట్రంలో కరోనా రోగులకు సరైన వైద్య పరీక్షలు చేయడం లేదని.... కేసులు పెరగడం వల్ల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని ప్రభాకర్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేట్లు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఛైర్మన్‌ను కోరారు.

ఇదీ చూడండి:కరోనాపై 'మిషన్​ ధారావి' ఎలా విజయం సాధించింది?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details