ప్రవీణ్‌యాదవ్ మృతిపై పూర్తస్థాయి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆస్పత్రి సూపరింటెండెంట్ వేధింపులతోనే.. కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్‌యాదవ్ మృతి చెందినట్లు పొన్నం ఆరోపించారు. ఓ అమాయకుడిని బలిచేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆస్పత్రుల సందర్శన సందర్భంగా.. హుజురాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై కేసునమోదు చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రివర్స్‌లో తమ పార్టీ నేతలపైనే కేసు పెట్టారని మండిపడ్డారు.